News September 3, 2024

సీఎం రేవంత్ విపత్తును కూడా రాజకీయం చేస్తున్నారు: హరీశ్ రావు

image

TG: సీఎం <<14005171>>రేవంత్<<>> నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. ‘సీఎం స్థాయిని దిగజార్చి, విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరం. తాను చీప్ మినిస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ఆలస్యంగా మొద్దు నిద్ర లేచి ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 2, 2025

ట్యాంక్ బండ్‌పై కాంగ్రెస్ శ్రేణుల నిరసన

image

HYD ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, బీజేపీ రాష్ట్రంపై వివక్ష చూపిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో చిన్నదైన రాష్ట్రానికి సరిగ్గా నిధుల కేటాయింపు జరగలేదని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

News February 2, 2025

కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణంపై దర్యాప్తు

image

గత నెల 29న మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30మంది మృతిచెందగా 60మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం దిశలో యూపీ సర్కారు దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 16వేలకు పైగా ఫోన్ నంబర్ల డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఘటనపై దర్యాప్తుకోసం సర్కారు ఇప్పటికే త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

News February 2, 2025

నా అవార్డు మా నాన్నకు అంకితం: గొంగడి త్రిష

image

భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. ‘నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మాజీ ప్లేయర్ మిథాలీరాజ్ నాకు ఆదర్శం. అండర్-19 వరల్డ్ కప్ భారత్‌ను వదిలి వెళ్లకూడదని అనుకున్నాను. నా బలాలపైనే దృష్టి పెట్టి ఆడాను. దేశానికి మరిన్ని మ్యాచులు ఆడి గెలవాలన్నది నా లక్ష్యం’ అని తెలిపారు.