News September 3, 2024
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా?

ఉదయం నిద్ర నుంచి లేచాక ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే శరీర జీవక్రియ రేటు సాధారణం కంటే 30% పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికలు ఆరోగ్యంగా మారతాయని, అలాగే శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 4 లీటర్ల నీరు తాగాలని సూచిస్తున్నారు.
Similar News
News December 26, 2025
రాష్ట్రంలో IASల బదిలీలు, పోస్టింగులు

TG: పలువురు IASలను బదిలీ చేస్తూ, మరికొందరికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా & డెవలప్‌మెంట్(HMDA పరిధి) ప్రత్యేక సీఎస్‌గా జయేశ్ రంజన్‌ను నియమించింది. ఈయన పర్యాటక ప్రత్యేక సీఎస్‌గా కొనసాగనున్నారు. అలాగే సిరిసిల్ల కలెక్టర్ హరితను TGPSC కార్యదర్శిగా బదిలీ చేసింది. అటు మరికొందరు ఐఏఎస్‌లను GHMC జోన్లకు కమిషనర్లుగా నియమించింది.
News December 26, 2025
ఆయుష్ సర్జరీలు CM, మంత్రులకూ చేయాలి: పీవీ రమేశ్

AP: PG <<18651050>>ఆయుర్వేద<<>> వైద్యులను సర్జరీలు చేసేందుకు అనుమతించడంపై రిటైర్డ్ IAS PV రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘AP కిరీటంలో ఇదో కలికితురాయి. ఈ ఆయుష్ శస్త్రచికిత్సలను ఉద్యోగులకే కాకుండా CM, Dy CM, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకూ తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాం’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలతో ఆంధ్రులను ముంచెత్తుతున్నారని వెటకారమాడారు.
News December 26, 2025
డీలిమిటేషన్: GHMCలో కొత్తగా 6 జోన్లు

TG: GHMC డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, డివిజన్లను 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌లను కొత్త జోన్లుగా పేర్కొంది.


