News September 3, 2024
మార్కాపురం: మేతకు వెళ్లిన గేదెను చంపిన చిరుత పులి

మార్కాపురం మండలంలోని గొట్టిపడియ బీట్‌లోని చక్రాల కాలువ లొకేషన్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన గేదెను <<14000352>>చిరుత పులి చంపి<<>> తినేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆదివారం మేత కోసం పశుపోషకులు గేదెను అడవిలోకి వదలగా.. రాత్రి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం కాపరులు అడవిలో గాలించి చిరుత పులి దాడిచేసి చంపి తిన్నట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.
Similar News
News January 12, 2026
ప్రకాశం జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటు చేశారు.

News January 11, 2026
ప్రకాశం: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటుచేశారు.