News September 3, 2024
CM రేవంత్ 2 వారాల్లో వివరణ ఇవ్వాలి: సుప్రీం

TG: BRS MLC కవితకు బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో T.కాంగ్రెస్ చేసిన పోస్టుపై వివరణ ఇవ్వాలని CM రేవంత్ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రెండు వారాల్లో రేవంత్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై ఆగస్టు 29న సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించగా రేవంత్ విచారం వ్యక్తం చేయడం తెలిసిందే.
Similar News
News January 13, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

శని త్రయోదశి శని దేవుని అనుగ్రహం పొందేందుకు అత్యంత విశిష్టమైన రోజు. ఏల్నాటి శని, అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పూజ అమోఘమైన పరిష్కారం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఆరాధనతో శని దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ పేరు, గోత్రంతో వేదమందిర్లో పూజ నిర్వహించుకుని శని దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ పూజను ఇప్పుడే <
News January 13, 2026
పిల్లలకు ఓదార్పునివ్వండిలా!

కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పిల్లలు ఇలా ఉంటే వాళ్లను మార్చాల్సిన బాధ్యత పేరెంట్స్దే. ఎందుకంటే పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఓదార్పునివ్వాలి. పిల్లలకి ఎందులో నైపుణ్యం ఉందో గుర్తించి, వాళ్ల అభిరుచులను తెలుసుకుని అందులో ఎదిగేలా సపోర్ట్ చేయండి. అప్పుడే పిల్లలు యాక్టివ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
News January 13, 2026
51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


