News September 3, 2024
విజయవాడ వరదలు: రూ.కోటి విరాళం

AP: విజయవాడలో వరద సహాయక చర్యల కోసం ఎన్నారై, పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. నిన్న సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితుల సమస్యలు తననెంతో కలచివేస్తున్నాయని చెప్పారు. మరోవైపు విజయవాడకు చెందిన అక్కాచెల్లెళ్లు విజయలక్ష్మి, నిర్మలాదేవి, రాణి రూ.50వేల చొప్పున రూ.1.50 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. వరదలతో బెజవాడ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
Similar News
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.