News September 3, 2024
పండగలొస్తున్నాయ్.. భారీ డిస్కౌంట్లే తెస్తున్నాయ్!
వినాయకచవితితో మొదలయ్యే పండగల సీజన్ క్రిస్మస్‌తో ముగుస్తుంది. అటు వ్యాపారులు ఇటు కస్టమర్లు ఎంతగానో ఎదురుచూసే సమయమిదే. దుస్తుల నుంచి అప్లయన్సెస్ వరకు కొనుగోళ్లు, అమ్మకాలకు ఇదే మంచి తరుణం. కంపెనీలు తమ వ్యాపార లక్ష్యాల్లో 20-30% సాధించేది ఇప్పుడే. అందుకే దీన్ని సద్వినియోగం చేసుకొనేందుకు భారీ రాయితీలు ఇవ్వడానికి అవి సిద్ధమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కార్లు, బైకులపై డిస్కౌంట్లు మొదలైపోయాయి.
Similar News
News February 2, 2025
BREAKING: చరిత్ర సృష్టించిన భారత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్‌పై చేసిన 82/2 పవర్‌ప్లేలో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.
News February 2, 2025
వాంఖడే స్టేడియంలో రిషి సునాక్
భారత్ పర్యటనలో ఉన్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వాంఖడే స్టేడియంలో సందడి చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల కెప్టెన్లు సూర్య, బట్లర్‌తో ఆయన సరదాగా సంభాషించారు. అంతకుముందు పార్సీ జింఖానా గ్రౌండ్‌లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన ముగియదని Xలో రాసుకొచ్చారు.
News February 2, 2025
ఈ సారి CCL కప్పు గెలుస్తాం: అఖిల్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఈ ఏడాది కప్పు గెలుస్తామంటూ హీరో అఖిల్ ధీమా వ్యక్తం చేశారు. 13 ఏళ్ల క్రితం విష్ణు ప్రారంభించిన CCL 11వ సీజన్ లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. జెర్సీ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నాలుగు సార్లు కప్పు గెలిచినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు CCL జరగనుంది. ఈ నెల 14, 15న తెలుగు వారియర్స్ మ్యాచ్ ఆడనుంది.