News September 3, 2024
HYD: స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై పిటిషన్ కొట్టివేత
దివ్యాంగులకు రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసింది. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వల్ల ఎవరి హక్కులకూ భంగం కలగలేదని, ఎవరూ నష్టపోలేదని, వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.
Similar News
News February 1, 2025
RR: పకడ్బందీగా ఏర్పట్లు చేయాలి: కలెక్టర్
మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ..పరీక్షల నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
News February 1, 2025
HYD: WOW.. త్వరలో అద్భుతమైన పార్క్ ఓపెన్!
HYD నగరంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న హిమాయత్ సాగర్, కొత్వాల్ గూడ పార్క్ త్వరలో ఓపెన్ కానుంది. దాదాపుగా 1000 రకాల పక్షులతో పక్షిశాలను సైతం సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఎక్వేరియం, పిక్నిక్ పార్కు, రిసార్టులు, అడ్వెంచర్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు అందుబాటులో ఉంచారు.
News February 1, 2025
గ్రేటర్ HYDలో గాలి నాణ్యత కేంద్రాలు ఉన్నవి అక్కడే!
గ్రేటర్ HYDలో గాలి నాణ్యతను పరీక్షించేందుకు ఉన్న కేంద్రాల లిస్టును CPCB అధికారులు వెల్లడించారు. న్యూ మలక్పేట, నాచారం-TSIIC, సోమాజిగూడ, ఈసీఐఎల్- కాప్రా, కొంపల్లి, కోకాపేట, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్ నగర్, ఇక్రిశాట్, పటాన్ చెరు, జవహర్ జూపార్క్ మొత్తంగా ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎయిర్ పొల్యూషన్ చెక్ చేస్తున్నట్లు తెలిపారు.