News September 3, 2024
కడప: ‘సమస్యలుంటే సంప్రదించండి’
కడప జిల్లాలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే 8561293086 నంబరుకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన ఫోన్ నంబరును ఆయన ప్రారంభించారు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు.
Similar News
News January 21, 2025
రాయచోటి: బాలికపై అత్యాచారం.. ల్యాబ్ టెక్నీషియన్ అరెస్టు
రాయచోటిలో పోక్సో కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. HIV నివారణ మందుల కోసం ప్రతి నెల ఆసుపత్రికి వెళ్లిన బాలికను ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఏడు నెలల గర్భిణి చేసి, నర్సు సహాయంతో అబార్షన్ చేయించాడు. ఇంట్లో విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు విజయ్‌ను అరెస్టు చేశారు.
News January 21, 2025
సిద్దవటం: కిడ్నీ వ్యాధితో ఏడేళ్ల బాలుడి మృతి
కడప జిల్లా సిద్దవటం మండలంలోని రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన రాజు, రామతులసి దంపతుల కుమారుడు మహేంద్రవర్మ(7) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రామక్రిష్ణాపురానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ఎంపీపీ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నేటి ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
News January 21, 2025
కడప: నేటి నుంచి YVU పీజీ పరీక్షలు
కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ అనుబంధ కళాశాలల MA, M.Com, M.Sc& M.P.Ed. మొదటి సెమిస్టర్ పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలు 21, 23, 25, 27, 29, 31 తేదీలలో ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.