News September 3, 2024

అప్పుడే పుట్టిన శిశువును పడవలో తరలించారు!

image

ఓ వైపు వరదలు మరోవైపు పురిటి నొప్పులు. అంబులెన్స్ రాలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో విజయవాడలో ఓ మహిళ ప్రసవించింది. దీంతో తల్లి, శిశువును సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్వయంగా పోలీసు ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. అప్పుడే పుట్టిన శిశువుతో బోటులో వెళ్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Similar News

News September 13, 2025

1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

image

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్‌ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.

News September 13, 2025

మహిళల్లోనే ఎక్కువగా కంటి సమస్యలు

image

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కంటి సంబంధిత సమస్యలు ఎక్కువని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో అధ్యయనం వెల్లడించింది. హార్మోన్ సమస్యలు, ప్రెగ్నెన్సీలో శరీరంలో నీటి పరిమాణం పెరిగి కార్నియా మందంగా మారడం, డయాబెటిక్ రెటినోపతి వల్ల కళ్లలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం కూడా కంటి సమస్యలకు మరో కారణమని పరిశోధకులు వెల్లడించారు.

News September 13, 2025

జగన్ గోడ మీద పిల్లి వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: అనగాని

image

AP: అమరావతిపై YCP నేతలు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ‘రాజధాని విషయంలో 3ముక్కలాట ఆడిన జగన్‌ను ప్రజలు 11సీట్లకే పరిమితం చేశారు. రాజధాని నిర్మాణం అక్కర్లేదంటూనే GNT – VJA మధ్య <<17688305>>రాజధాని నిర్మిస్తామని<<>> చెబుతున్న YCP నేతల కబుర్లు నమ్మడానికి సిద్ధంగా లేరు. రాజధానిపై జగన్ గోడ మీద పిల్లి వైఖరిని జనం గమనిస్తూనే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.