News September 3, 2024

సూర్య దేవుడొచ్చేశాడు!

image

నాలుగైదు రోజులుగా సూర్యరశ్మి తగలక వణికిపోతున్న శరీరానికి ఊరటనిచ్చేందుకు కారు మబ్బులను చీల్చుకుంటూ భానుడు బయటకొచ్చాడు. హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం కురిసినప్పటికీ ఒక్కసారిగా వాతావరణం పొడిగా మారిపోయింది. ప్రస్తుతం సూర్యుడు వచ్చేసరికి నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీవద్ద సూర్యుడు వచ్చాడో? లేదో? కామెంట్ చేయండి.

Similar News

News December 26, 2025

బోరాన్ స్ప్రేతో మామిడి పంటకు కలిగే లాభాలు

image

బోరాన్ పిచికారీ వల్ల పూత, పిందె రాలడం, పండ్లు పగలకుండా ఉండటమే కాకుండా.. ఇవి మామిడి పండ్లలో చక్కెర, విటమిన్ సి స్థాయిలను, గుజ్జు శాతాన్ని పెంచుతుంది. బోరాన్‌ను లేత పూత దశలో మరియు పిందెలు వృద్ధి చెందే దశలో పిచికారీ చేసే పురుగు మందులతో కలిపి స్ప్రే చేయవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఇలా చేయడం వల్ల రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెబుతున్నారు. నిపుణుల సూచనలతో అవసరమైన మోతాదులో బోరాన్ పిచికారీ చేయాలి.

News December 26, 2025

శుక్రవారం లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు?

image

శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్ర గ్రహం లక్ష్మీదేవి అధీనంలో ఉంటుంది. అందుకే శుక్రుడు అనుకూలంగా ఉండే ఈ రోజున అమ్మవారిని పూజిస్తే.. ధనం, సౌభాగ్యం, కళాభివృద్ధి లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజున వ్రతాలు, తులసి పూజ, దానధర్మాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం వ్రతం వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 26, 2025

ఓట్స్‌తో చర్మానికి గ్లో..

image

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలామంది ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఇవి కేవలం ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలోనూ సహకరిస్తాయి. 3 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల ఓట్స్, నిమ్మరసం వేసి పేస్ట్‌ చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓట్స్‌లో ఉండే జింక్, ప్రోటీన్స్, విటమిన్-ఇ చర్మాన్ని తేమగా, మెరిసేలా చేస్తాయి.