News September 3, 2024

ఆక్రమణల వల్లే వరదలు.. తొలగిస్తాం: సీఎం రేవంత్

image

TG: ఖమ్మం నగరంలో ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘పువ్వాడ అజయ్ ఆక్రమించిన స్థలంలో ఆస్పత్రి కట్టారు. ఆక్రమణలు తొలగించాలని పువ్వాడకు హరీశ్ రావు చెప్పాలి. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తాం. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తాం. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడింది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు.

Similar News

News July 7, 2025

BIG ALERT.. అతి భారీ వర్షాలు

image

TG: పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. అటు రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిన్న పలు జిల్లాల్లో వర్షాలు పడిన సంగతి తెలిసిందే.

News July 7, 2025

డార్క్ చాక్లెట్‌ తినడం వల్ల లాభాలు!

image

ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. కానీ, డార్క్ చాక్లెట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
*రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
*యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
*జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గుతుంది
*జీర్ణక్రియ మెరుగవుతుంది
*వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
*మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది

News July 7, 2025

ఆకాశ్ దీప్.. ఆకాశమంత టాలెంట్ అంతే మనస్సు

image

ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో భారత పేసర్ ఆకాశ్ దీప్ పేరు మారుమోగుతోంది. బుమ్రా లేకపోతే ఇంగ్లండ్ చేతిలో 2వ టెస్టులోనూ మనకు ఓటమి తప్పదనుకున్నారంతా. కానీ, ఆకాశ్ 10 వికెట్లు తీసి భారత్‌కు మరుపురాని విజయాన్ని కట్టబెట్టారు. బుమ్రాను మరిపించారు. ఈ ఘనతను క్యాన్సర్‌తో పోరాడుతున్న తన సోదరికి అంకితమిచ్చి హృదయాలు గెలిచారు. గబ్బా‌లో గతంలో ఆకాశ్ గురించి ‌స్మిత్ ఎందుకు పొగిడారో ఈ మ్యాచ్‌తో అందరికీ అర్థమైంది.