News September 3, 2024
రూ.కోటి, ఆ పైన జీతంతో 22 మందికి ఉద్యోగాలు
2023-24లో ఐఐటీ బాంబేలో 1,475 మంది ఉద్యోగాలు సాధించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీరు సగటున రూ.23.50 లక్షల వార్షిక వేతన పొందుతున్నట్లు తెలిపింది. రూ.కోటి, ఆపైన వార్షిక వేతనంతో 22 మంది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొంది. బీటెక్‌లో 83.39 శాతం, ఎమ్‌టెక్‌లో 83.5, ఎమ్ఎస్ రీసెర్చ్‌లో 93.33 శాతం ప్లేస్మెంట్లు జరిగినట్లు ప్రకటించింది.
Similar News
News February 3, 2025
విఫలమవుతున్నా సంజూకి ఛాన్సులివ్వాలి: మంజ్రేకర్
సంజూ శాంసన్ వరసగా విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి ఎక్కువ అవకాశాలిస్తూ ఉండాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో పరుగులెన్ని చేశారని కాకుండా ఆటగాడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడో అంచనా వేయాలి. సంజూ వంటి బ్యాటర్ క్రీజులో ఉంటే మ్యాచ్ గతినే మార్చేయగలరు. ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలరు. ఒక్కోసారి వైఫల్యాలు వస్తాయి. అయినప్పటికీ ఓపిగ్గా ఛాన్సులిచ్చి అండగా నిలవాలి’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘తండేల్’ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని భావించినా కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో చాలా కాలం తర్వాత AA స్పీచ్ విందామనుకున్న అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. అల్లు అర్జున్ వస్తారనే ఈ ఈవెంట్‌కి ఫ్యాన్స్‌కు ఎంట్రీ నిషేధించారని సినీ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
News February 3, 2025
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
* అభిషేక్ శర్మ-135(ఇంగ్లండ్‌పై)
* శుభ్‌మన్ గిల్- 126*(న్యూజిలాండ్‌పై)
* రుతురాజ్ గైక్వాడ్- 123*(ఆస్ట్రేలియాపై)
* విరాట్ కోహ్లీ- 122*(అఫ్గానిస్థాన్‌పై)
* రోహిత్ శర్మ- 121*(అఫ్గానిస్థాన్‌పై)