News September 3, 2024

బాధితులు సంయమనం వహించాలి: సీఎం చంద్రబాబు

image

AP: విజయవాడలో ప్రతి ఏరియాకు ఆహారం, నీళ్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అర్ధగంట ఆలస్యమైందని ఆవేశపడితే అది నాలుగైదు గంటలు అయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల వ్యవస్థలు నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం 3 బాధిత కుటుంబాలను ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో ముందుకు రావాలని కోరారు.

Similar News

News August 6, 2025

రూ.1,000 పెరిగిన వెండి ధర

image

బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹110 పెరిగి ₹1,02,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹100 పెరిగి ₹93,800 పలుకుతోంది. 5 రోజుల్లో బంగారం ధర రూ.2,510 పెరగడం గమనార్హం. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 6, 2025

‘రాజాసాబ్’ పార్ట్-2 ఉంటుంది: విశ్వప్రసాద్

image

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’కు పార్ట్-2 ఉంటుందని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. అయితే జోనర్ వేరే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘రాజాసాబ్’ రిలీజ్ వాయిదా ప్రచారంపై స్పందిస్తూ తెలుగు ఆడియన్స్ జనవరిలో రిలీజ్ చేయమని కోరుతున్నట్లు చెప్పారు. డిసెంబర్‌లో అయితే హిందీ మార్కెట్‌కు అనుకూలిస్తుందని అన్నారు. ఈ విషయమై ఆలోచిస్తున్నామన్నారు. కాగా రాజాసాబ్ Dec 5న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు.

News August 6, 2025

భర్త భరణంపై ఆధారపడొద్దు.. విడాకులపై SC తీర్పు

image

పని చేసే వీలున్న మహిళ భరణం కోసం పాకులాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముంబైకి చెందిన ఓ మహిళ 18 నెలలకే భర్త నుంచి విడిపోవాలనుకుంది. రూ.12 కోట్లతో పాటు ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ఇప్పించాలని కోరింది. సదరు మహిళ ఉన్నత విద్య చదివిందని తెలుసుకున్న కోర్టు.. ‘మీరెందుకు ఉద్యోగం చేయరు? ఇతరులపై ఆధారపడకుండా హుందాగా జీవించవచ్చు కదా’ అని ప్రశ్నించింది. ఫ్లాట్ మాత్రమే భరణంగా వస్తుందని తీర్పు చెప్పింది.