News September 3, 2024

విపక్ష నేత ఒక్కరినైనా పరామర్శించారా?: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘విపక్ష నేత నిన్న 5 నిమిషాలు షో చేసి వెళ్లారు. ఆయన ఒక్కరికైనా భోజనం సరఫరా చేశారా? ఒక్కరినన్నా పరామర్శించారా? సపోర్ట్ చేశారా? అందుకే ఆయన్ను ఎస్కోబార్ అంటున్నా’ అని మండిపడ్డారు.

Similar News

News November 5, 2025

బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది. సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది. బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

News November 5, 2025

ఎక్కువ సేపు కూర్చుంటే ‘థ్రాంబోసిస్’ వ్యాధి

image

4-6 గంటలు ఒకేచోట కూర్చుని పనిచేసే వాళ్లలో రక్తం గడ్డకట్టే(థ్రాంబోసిస్) వ్యాధి పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక జీవనశైలి, ఎక్కువదూరం ఫ్లైట్ జర్నీలు, ఆస్పత్రుల్లో అధిక సమయం గడపడం వల్ల ఈ రిస్క్ ఉంటుందని వెల్లడైంది. ‘ఇలాంటివారి కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డ కడుతుంది. దీంతో తీవ్రమైన నొప్పితో బాధపడతారు. దీన్ని మొదట్లోనే నియంత్రించకపోతే ఊపిరితిత్తులు, గుండెకూ సమస్య రావొచ్చు’ అని తేలింది.

News November 5, 2025

‘థ్రాంబోసిస్’ వ్యాధిని నివారించాలంటే?

image

* డెస్క్‌, ఆస్పత్రుల్లో ఎక్కువ గంటలు గడపాల్సి ఉంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
* కూర్చున్న చోటే లెగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. వీలుంటే తక్కువ దూరాలైనా నడవాలి.
* ఫ్లైట్, ట్రైన్, బస్సు లాంగ్ జర్నీలలో కనీసం గంటకోసారైనా లేచి నడవాలి. దీనివల్ల కాళ్లలో రక్తసరఫరా మెరుగుపడుతుంది.
* కాళ్ల నొప్పులు ఉంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి.