News September 3, 2024

రూ.30లక్షల విరాళం ప్రకటించిన ‘డీజే టిల్లు’

image

‘డీజే టిల్లు’ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరద బాధితుల కోసం రూ.30లక్షలు ప్రకటించారు. APకి రూ.15లక్షలు, TGకి రూ.15లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని డబ్బుతో పూడ్చలేమన్న హీరో ఏదో ఒక రూపంలో ఇది బాధితులకు ఉపయోగపడాలని ప్రార్థిస్తున్నా అన్నారు.

Similar News

News August 5, 2025

24 గంటల్లో ఇండియాపై భారీగా టారిఫ్స్ పెంచుతా: ట్రంప్

image

టారిఫ్స్ విషయంలో ట్రంప్ మరోసారి భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మరో 24 గంటల్లో టారిఫ్స్ భారీగా పెంచనున్నట్లు ప్రకటించారు. ‘భారత్ మంచి వ్యాపార భాగస్వామిగా ఉండటం లేదు. వారితో బిజినెస్ చేయడం కష్టంగా మారింది. 25% టారిఫ్స్‌తో సరిపెడదామనుకున్నా. కానీ ఇప్పుడు మరింత పెంచాలని నిర్ణయించాను. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందున 24 గంటల్లో భారీ స్థాయిలో సుంకాలు పెంచబోతున్నా’ అని వ్యాఖ్యానించారు.

News August 5, 2025

ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు త్వరలో రివ్యూ

image

AP: TDP MLAల పనితీరుపై పార్టీ చీఫ్ చంద్రబాబు త్వరలో రివ్యూ చేయనున్నారు. IVRS కాల్స్, ఇంటెలిజెన్స్, పార్టీ చేసిన 2సర్వేల రిపోర్టు ఆధారంగా ఈ రివ్యూ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి. ఓవరాల్ రిపోర్టులో రెడ్ జోన్‌లోని టాప్-20లో ఇప్పటికే కొందరితో రివ్యూ జరిగింది. త్వరలోనే మిగతా నేతలతో సమీక్షలు జరుపుతారని సమాచారం. ఇంప్రూవ్‌మెంట్ కోసం 3నెలలు టైం ఇచ్చి మారకుంటే చర్యలు తీసుకునే అవకాశముంది.

News August 5, 2025

ఇండియాకు ఆ హక్కు ఉంది: రష్యా

image

ఆయిల్ దిగుమతులపై US బెదిరింపుల నేపథ్యంలో రష్యా భారత్‌కు మద్దతుగా నిలిచింది. ‘ట్రేడ్, ఎకనామిక్ సహకారం కోసం పార్ట్‌నర్స్‌ను ఎంచుకోవడం ఆయా దేశాల ఇష్టం. ఇది వారి హక్కు. ఇందుకు విరుద్ధంగా US చేస్తున్న ప్రయత్నాలు, హెచ్చరికలు లీగల్ కాదు’ అని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆక్షేపించారు. కాగా టారిఫ్స్ భారీగా పెంచుతానన్న ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఇప్పటికే స్ట్రాంగ్ <<17305975>>కౌంటర్<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.