News September 3, 2024
‘దేవా’ పేరుకు డిమాండ్ ఎక్కువ!

స్టార్ హీరోల సినిమాల్లో ‘దేవా’ పేరు మారుమోగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సలార్’లో ఆయన పేరు ‘దేవా’నే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రాబోతున్న ‘దేవర’లోనూ హీరో ‘దేవా’గా కనిపించనున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దేవా’ రోల్ పోషిస్తున్నారు. దీంతో ‘దేవా’ పేరుకు ఇంత క్రేజ్ ఏంటని నెట్టింట చర్చ జరుగుతోంది.
Similar News
News December 29, 2025
హైదరాబాద్ ESICలో 102 పోస్టులు.. నేటి నుంచి ఇంటర్వ్యూలు

<
News December 29, 2025
చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రమిదే…

యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర ||
News December 29, 2025
ఏడు కురచలు చూచి ఎద్దును కొనాలి(2/2)

☛ మెడ: మెడ పొట్టిగా, బలంగా ఉంటే కాడిని మోసే శక్తి ఎక్కువ.
☛ తోక: తోక పొట్టిగా లేకుంటే నేలకు తగిలి పనిలో వేగం తగ్గుతుంది.
☛ చెవులు: చెవులు చిన్నవిగా ఉంటే ఆ ఎద్దు చురుకుగా ఉంటుంది.
☛ కొమ్ములు: కొమ్ములు పొట్టిగా ఉంటే ఎద్దు బలానికి నిదర్శనం.
☛ ముఖం: ముఖం చిన్నదిగా ఉండాలి.
☛ వీపు: వీపు కురచగా, గట్టిగా ఉంటే బరువులను బాగా లాగుతుంది.
☛ గిట్టలు: కాళ్లు మరీ పొడవుగా కాకుండా, గిట్టలు కురచగా, బలంగా ఉండాలి.


