News September 3, 2024

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాకినాడ, తూ.గో, కోనసీమ, యానాం, ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Similar News

News August 6, 2025

SBIలో జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు

image

SBIలో 5వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆన్‌లైన్‌లో <>దరఖాస్తు<<>> చేసుకోవచ్చు. ఇందులో APలో 310, TGలో 250 పోస్టులున్నాయి. గ్రాడ్యుయేట్లు, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వారు అర్హులు. వయసు 20-28 ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.750. SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు.

News August 6, 2025

రేపటి నుంచి వారికి ఉచిత విద్యుత్

image

AP: చేనేతలకు భరోసా ఇచ్చేందుకు మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి వీటిని అమలు చేయాలని తెలిపారు. దీంతో పాటు చేనేత వస్త్రాలపై జీఎస్టీ ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. అలాగే కార్మికుల కోసం రూ.5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

News August 6, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.