News September 3, 2024

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: సీఎం రేవంత్

image

TG: మహబూబాబాద్ జిల్లాలో నలుగురు మరణించడం బాధాకరమని CM రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. రైతులను ఆదుకుంటామన్నారు. అధికారులు, పోలీసు సిబ్బంది నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొనడం వల్లే ప్రాణ నష్టం తగ్గిందన్నారు. కేంద్రం తక్షణమే రాష్ట్రానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వర్షం తగ్గడంతో బురదను తొలగించే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News August 5, 2025

మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను: వెంకట్‌రెడ్డి

image

TG: మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చానని రాజగోపాల్‌రెడ్డి చేసిన <<17311638>>వ్యాఖ్యలపై<<>> మంత్రి వెంకట్‌రెడ్డి స్పందించారు. మంత్రి పదవిపై అతడికి మాట ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. ‘రాజకీయాల్లో అన్నదమ్ములు అంటూ ఏమీ ఉండదు. తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను. దీనిపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం. పదవి నేను అడగలేదు. అధిష్ఠానమే ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు.

News August 5, 2025

CBSE టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

image

CBSE టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై 15 నుంచి 22 వరకు ఈ పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్/స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 5, 2025

ట్రంప్ మాట లెక్క చేయని టిమ్ కుక్!

image

US అధ్యక్షుడు ట్రంప్ మాటలను యాపిల్ CEO టిమ్ కుక్ లెక్క చేయడంలేదు. భారత్‌లో ఐఫోన్ల తయారీనే వద్దని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ‘అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్ల ఉత్పత్తికి భారతే ప్రధాన హబ్‌గా మారింది. భవిష్యత్తులోనూ అది కొనసాగుతుంది. ఐఫోన్ల అమ్మకాలకూ భారత్ కలిసొచ్చింది. ఇండియాలో రికార్డుస్థాయిలో రెవెన్యూ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 10% వృద్ధి నమోదైంది’ అని టిమ్ కుక్ పేర్కొన్నారు.