News September 3, 2024
దాతల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు

AP: ఊహించని వర్షాలు, వరదలతో బెజవాడ నగరం గజగజ వణికింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లక్షలమంది కడుపు నింపేందుకు స్థానిక హోటళ్లు, అక్షయపాత్ర, ఇతర సంస్థల సాయంతో ప్రభుత్వం ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకుంటున్న వారి కోసం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. IAS శ్రీమనజీర్ 7906796105ను సంప్రదించాలని సూచించింది.
Similar News
News August 5, 2025
స్వదేశానికి బయల్దేరిన భారత ఆటగాళ్లు

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను భారత్ నిన్న గెలుపుతో సమం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ఆటగాళ్లు స్వదేశానికి తిరిగొస్తున్నారు. అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా చివరి టెస్టులో భారత్ ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి రోజు 35 పరుగులు చేయకుండా ప్రత్యర్థులను అడ్డుకుని చిరస్మరణీయ విజయం సాధించింది.
News August 5, 2025
‘సీతారామం’ విడుదలకు మూడేళ్లు.. నిర్మాత స్పెషల్ మెసేజ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన వింటేజ్ లవ్ స్టోరీ ‘సీతారామం’ విడుదలై నేటికి మూడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత స్వప్న దత్ ₹100 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘ఈ సినిమా ₹100 కోట్లను చేరుకుంటుందని ఈ పోస్టర్ రూపొందించాం. కానీ రూ.97కోట్ల వద్దే ఆగిపోయింది. నంబర్‌తో సంబంధం లేదని మూడేళ్లకు గ్రహించాం’ అని పోస్ట్ చేశారు.
News August 5, 2025
‘కాళేశ్వరం’పై చర్చ.. ఈ నెలలోనే అసెంబ్లీ సెషన్!

TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా MLAలు, MLCలకు రిపోర్టును వివరించి అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఈనెల మూడో వారంలో ప్రత్యేక సెషన్ నిర్వహించేందుకు క్యాబినెట్లో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలో చర్చించాక మండలాల వారీగా MLAలు మీటింగ్స్ పెట్టి ‘కాళేశ్వరం’ నివేదికపై వివరించనున్నట్లు తెలుస్తోంది.