News September 3, 2024
వరదల్లో 28 మంది మరణిస్తే 16 అని చెప్పారు: హరీశ్ రావు

TG: సాయం చేయలేదని ప్రశ్నించిన తమపై దాడి చేస్తారా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వరదల్లో 28 మంది చనిపోతే కేవలం 16 మంది చనిపోయారని చెప్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరదలు వచ్చిన రోజు సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలయ్యారని అన్నారు.
Similar News
News January 14, 2026
‘10 మినిట్స్ డెలివరీ’పై జెప్టో, స్విగ్గీ వెనక్కి

కేంద్రం <<18845524>>ఆదేశాలతో<<>> 10 మినిట్స్ డెలివరీ క్లెయిమ్‌ను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో నిలిపివేశాయి. నిన్న బ్లింకిట్ ఈ ప్రకటన చేయగా తాజాగా ఈ రెండు సంస్థలూ 10 మినిట్స్ క్లెయిమ్‌ను ఆపివేస్తున్నట్లు తెలిపాయి. తమ వెబ్‌సైట్లు, యాప్‌ల నుంచి ‘10 మినిట్స్ డెలివరీ’ అనే ప్రకటనలను తొలగించాయి. కాగా గిగ్ వర్కర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ హామీని ఇవ్వొద్దని కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయా డెలివరీ సంస్థలకు సూచించారు.
News January 14, 2026
ఒకప్పుడు ₹2వేల కోట్ల ఆస్తులు.. కానీ ఇప్పుడు..!

దర్భాంగా ఫ్యామిలీ (బిహార్) దేశంలోని రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీలలో ఒకటి. ఈ ఫ్యామిలీ చివరి మహారాణి కామసుందరి దేవి(96) ఈ నెల 12న చనిపోయారు. ఆమె భర్త, చివరి మహారాజు కామేశ్వర్ సింగ్ 1962లో చనిపోగా, అప్పుడు ఈ ఫ్యామిలీ ఆస్తుల విలువ ₹2,000Cr(ప్రస్తుత వాల్యూ ₹4లక్షల కోట్లు). ఇందులో ఇప్పుడు 2% కంటే తక్కువే ఉన్నట్లు సమాచారం. 1962 IND-CHN యుద్ధం సమయంలో ఈ ఫ్యామిలీ ప్రభుత్వానికి 600kgs గోల్డ్ సాయం చేసింది.
News January 14, 2026
APPLY NOW: BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in


