News September 3, 2024

స్టోన్ బేబీ.. దేశ చరిత్రలోనే అరుదైన ఆపరేషన్

image

AP: వైజాగ్‌లోని కేజీహెచ్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ కడుపులోంచి లిథోపిడియన్ అనే గడ్డ, ఎముకల వంటి పదార్థాన్ని తొలగించారు. వైద్య పరిభాషలో దీనిని స్టోన్ బేబీ అని పిలుస్తారని ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద్ తెలిపారు. ఇది చాలా అరుదైన కేసు అని, ఆపరేషన్ విజయవంతమవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.

Similar News

News February 3, 2025

చరిత్ర సృష్టించిన రసెల్

image

వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.

News February 3, 2025

IIFA అవార్డ్స్.. నామినేషన్లు ఈ చిత్రాలకే

image

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA)-2025కు హిందీ నుంచి నామినేషన్ల జాబితా విడుదలైంది. కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ ఏకంగా 9 విభాగాల్లో పోటీ పడుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రి, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్య-3 ఏడు, స్త్రీ-2 ఆరు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. జైపూర్ వేదికగా IIFA సిల్వర్ జూబ్లీ వేడుక మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది.

News February 3, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఎప్పుడుదప్పులు వెదకెడు
నప్పురుషునిగొల్వగూడదదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
తాత్పర్యం: నల్లతాచు నీడలో నివసించే కప్ప బతుకు ఎంత అస్థిరంగా ఉంటుందో ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పనిచేసే వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది.