News September 3, 2024
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నిలిపివేత

UPలో ఆస్తులు ప్రకటించని 2.44 లక్షల మంది ఉద్యోగులకు ప్రభుత్వం ఆగస్టు నెల జీతాలు నిలిపేసింది. ఆగస్టు 31లోపు ఉద్యోగులు స్థిర, చర ఆస్తుల వివరాలు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 6 లక్షల మంది తమ ఆస్తులను ప్రకటించారు. మిగిలినవారు స్పందించకపోవడంతో జీతాలు నిలిపేసింది. అయితే, పండుగల నేపథ్యంలో జీతాల విడుదలకు ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ఆస్తుల ప్రకటన గడువు Sep 30వరకు పొడిగించింది.
Similar News
News August 5, 2025
మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను: వెంకట్‌రెడ్డి

TG: మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చానని రాజగోపాల్‌రెడ్డి చేసిన <<17311638>>వ్యాఖ్యలపై<<>> మంత్రి వెంకట్‌రెడ్డి స్పందించారు. మంత్రి పదవిపై అతడికి మాట ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. ‘రాజకీయాల్లో అన్నదమ్ములు అంటూ ఏమీ ఉండదు. తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను. దీనిపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం. పదవి నేను అడగలేదు. అధిష్ఠానమే ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
News August 5, 2025
CBSE టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

CBSE టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై 15 నుంచి 22 వరకు ఈ పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్/స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ కోసం ఇక్కడ <
News August 5, 2025
ట్రంప్ మాట లెక్క చేయని టిమ్ కుక్!

US అధ్యక్షుడు ట్రంప్ మాటలను యాపిల్ CEO టిమ్ కుక్ లెక్క చేయడంలేదు. భారత్‌లో ఐఫోన్ల తయారీనే వద్దని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ‘అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్ల ఉత్పత్తికి భారతే ప్రధాన హబ్‌గా మారింది. భవిష్యత్తులోనూ అది కొనసాగుతుంది. ఐఫోన్ల అమ్మకాలకూ భారత్ కలిసొచ్చింది. ఇండియాలో రికార్డుస్థాయిలో రెవెన్యూ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 10% వృద్ధి నమోదైంది’ అని టిమ్ కుక్ పేర్కొన్నారు.