News September 3, 2024
దేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ఇదీ ఓ కారణమే!
భారతదేశంలో బ్రిటిష్ వారు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గల ముఖ్య కారణాలలో ఒకదాని గురించి ఓ రైల్వే అధికారి చెప్పుకొచ్చారు. ‘1845లో మొదటి ఆంగ్లో- సిక్కు యుద్ధం జరిగినప్పుడు దేశంలో రైళ్లు అందుబాటులో లేవు. ఆ సమయంలో దళాలను కోల్‌కతా నుంచి బెనారస్‌కు తరలించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి 16 రోజులు పట్టింది. దీంతో వేగవంతమైన సరఫరా కోసం రైలు ముఖ్యమని భావించి తీసుకొచ్చారు’ అని Xలో తెలిపారు.
Similar News
News February 3, 2025
IIFA అవార్డ్స్.. నామినేషన్లు ఈ చిత్రాలకే
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA)-2025కు హిందీ నుంచి నామినేషన్ల జాబితా విడుదలైంది. కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ ఏకంగా 9 విభాగాల్లో పోటీ పడుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రి, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్య-3 ఏడు, స్త్రీ-2 ఆరు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. జైపూర్ వేదికగా IIFA సిల్వర్ జూబ్లీ వేడుక మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది.
News February 3, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఎప్పుడుదప్పులు వెదకెడు
నప్పురుషునిగొల్వగూడదదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
తాత్పర్యం: నల్లతాచు నీడలో నివసించే కప్ప బతుకు ఎంత అస్థిరంగా ఉంటుందో ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పనిచేసే వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది.
News February 3, 2025
వచ్చే వారం 4 ఐపీవోలు
మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు ఈ నెల 4-10వ తేదీల మధ్య నాలుగు కంపెనీలు IPOకు రానున్నాయి. ఎలిగాంజ్ ఇంటీరియర్స్ రూ.78.07 కోట్లు, అమ్విల్ హెల్త్ కేర్ రూ.59.98 కోట్లు, రెడ్‌మిక్స్ కన్‌స్ట్రక్షన్ రూ.37.66 కోట్లు, చాముండా ఎలక్ట్రానిక్స్ రూ.14.60 కోట్లు సేకరించనున్నాయి. అలాగే డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్, మల్పాని పైప్స్ కంపెనీలు లిస్ట్ కానున్నాయి.