News September 3, 2024

MBNR: అతిథి అధ్యాపకుల సేవలను వినియోగించుకునేందుకు ఉత్తర్వులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతిథి ఆధ్యాపకుల సేవలను 2024-25 విద్యా సంవత్సరానికి వినియోగించుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్తగా జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించనుంది. ప్రస్తుతం వీరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. వీరు విధుల్లో చేరే వరకు అతిథి అధ్యాపకులను కొనసాగించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News September 14, 2025

మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో డీకే అరుణ

image

తిరుప‌తి వేద‌కగా ఆదివారం ప్రారంభ‌మైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్లమెంట్ పరిధిలో మహిళా సాధికారత, 10 అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, మహిళ 7 ఆత్మగౌరవాన్ని పెంచే దిశలో తీసుకోవాల్సిన చర్యలు, ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై కీలకంగా చర్చించడం జరుగుతుందన్నారు.

News September 14, 2025

MBNR:జాతీయ మెగా లోక్ అదాలత్..UPDATE

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒సైబర్ కేసులు:97(₹32,19,769/- రీఫండ్)
✒కాంప్రమైజ్ కేసులు:193
✒ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు(డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act):564
✒ఐపీసీ(అండర్ ఇన్వెస్టిగేషన్/కోర్టు విచారణలో ఉన్నవి): కేసులు-253
✒మొత్తం పరిష్కరించబడిన కేసులు: 2,597