News September 3, 2024
భారత వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్
FY25కి భారత వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు 6.6% నుంచి 7 శాతానికి పెంచింది. దేశీయంగా ఉత్పత్తి, మెరుగైన ఎగుమతులు వంటి అంశాలతో దేశ ఆర్థిక పనితీరుపై ప్రపంచ బ్యాంకు పాజిటివ్‌గా ఉంది. FY23-24లో 8.2 శాతం వేగంగా వృద్ధి చెందిందని, ప్రజా మౌలిక సదుపాయాలు, గృహ పెట్టుబడుల పెరుగుదల దీనికి కారణంగా నివేదిక పేర్కొంది. మహిళా ఉద్యోగులు గణనీయంగా పెరిగినా, అర్బన్ యూత్ అన్ఎంప్లాయిమెంట్ 17 శాతంగా ఉంది.
Similar News
News February 3, 2025
English Learning: Antonyms
✒ Frivolous× Solemn, significant
✒ Frantic× Subdued, gentle
✒ Frugality× Lavishness, extravagance
✒ Gloom× Delight, mirth
✒ Gather× Disperse, Dissemble
✒ Gorgeous× Dull, unpretentious
✒ Glut× Starve, abstain
✒ Grisly× Pleasing, attractive
✒ Gracious× Rude, Unforgiving
News February 3, 2025
చరిత్ర సృష్టించిన రసెల్
వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్‌గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.
News February 3, 2025
IIFA అవార్డ్స్.. నామినేషన్లు ఈ చిత్రాలకే
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA)-2025కు హిందీ నుంచి నామినేషన్ల జాబితా విడుదలైంది. కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ ఏకంగా 9 విభాగాల్లో పోటీ పడుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రి, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్య-3 ఏడు, స్త్రీ-2 ఆరు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. జైపూర్ వేదికగా IIFA సిల్వర్ జూబ్లీ వేడుక మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది.