News September 4, 2024
MDK: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ
వినాయక నవరాత్రి వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. జోగిపేటలో శాంతి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబి, వినాయక నిమజ్జనం ఒకేసారి రావడంతో ఇరువర్గాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్సై పాండు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 26, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
News November 25, 2024
దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి
కొండపాక వాస్తవ్యులు దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కేసీఆర్‌కు రాజకీయ సమకాలికులు. ఆయన మృతిపట్ల మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. 1983-88లో అప్పటి దొమ్మాట ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో ప్రజా సేవలో ఉన్న ఆయన సేవలు నేటితరం వారికి స్ఫూర్తి అని కొనియాడారు.
News November 25, 2024
మెదక్: నేడు ప్రజావాణి కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.