News September 4, 2024

నేడు డీఎస్సీ ఫైనల్ కీ విడుదల?

image

TG: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేసే ఛాన్సుంది. దీని ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను ఎవరికివారు తెలుసుకోవచ్చు. తుది కీ విడుదలైన తర్వాత 2, 3 రోజుల్లో డీఎస్సీ మార్కులకు (80%), టెట్ మార్కులు (20%) కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టును అధికారులు విడుదల చేస్తారు.

Similar News

News February 18, 2026

బొప్పాయి రోజూ తింటే..

image

బొప్పాయి అన్ని సీజన్లలో లభించే పండ్లలో ఒకటి. దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. జీర్ణ సమస్యలు, దృష్టిలోపాలతో పాటు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. వీటితో పాటు అల్జీమర్స్, ఆర్థరైటిస్, డయాబెటిస్, గుండెజబ్బులను దూరం చేయడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.

News February 18, 2026

టాప్ 10 ధనిక రాష్ట్రాల్లో AP, TG

image

FY25లో టాప్ 10 రిచెస్ట్ స్టేట్స్‌లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ₹16.41లక్షల కోట్లతో తెలంగాణ ఏడో స్థానంలో, ₹15.93లక్షల కోట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఇక ₹45.32లక్షల కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచినట్లు RBI డేటా వెల్లడించింది. తమిళనాడు (₹31.19L Cr) రెండోస్థానం, యూపీ (₹29.78L Cr) మూడోస్థానంలో నిలిచాయి. ఇక అత్యల్ప GSDP ఉన్న రాష్ట్రంగా ₹4423 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది.

News February 18, 2026

ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోండి

image

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం అతిపెద్ద టాస్క్. దీనికి బ్యాంకులు/ పోస్టాఫీసుల్లో క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ యాప్‌తో పాటు ఫేస్ అథెంటికేషన్ కోసం AadhaarFaceRD యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఆటోమెటిక్‌గా సంబంధిత బ్యాంక్‌కు వెళ్తుంది.