News September 4, 2024
తూర్పుగోదావరి జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి జిల్లాలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలను తెరవద్దని ఆయన సూచించారు.
Similar News
News October 18, 2025
రేపు రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్: కలెక్టర్

వాణిజ్య, వ్యాపార రంగాలకు నూతన ఉత్సాహం నింపే లక్ష్యంతో ‘ది గ్రేట్ రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రాజమండ్రిలో తెలిపారు. ఈ నెల 19న (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆనంద్ రీజెన్సీ సమీపంలోని పందిరి ఫంక్షన్ హాల్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహన పెంచడం, వ్యాపారంలో ఉత్సాహం నింపడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు.
News October 18, 2025
రాజమండ్రి: 20న పీజీఆర్‌ఎస్‌కు సెలవు

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20(సోమవారం) రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాన్ని పురస్కరించుకుని జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా meekosam.ap.gov.in ద్వారా తెలియజేయవచ్చని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News October 18, 2025
రాజమండ్రి: నార్కో కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశం

తూర్పు గోదావరి జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి నార్కో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలలో చైతన్యం పెంచి, యువత గంజాయికి దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.