News September 4, 2024

HYDను క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యం: CM

image

HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 23, 2026

ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

image

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్‌లపై స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్‌తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.

News January 20, 2026

RR: బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్స్‌కు అప్లై చేసుకోండి

image

PWDs సాధికారత, లబ్ధికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా మహిళలు, శిశువులు, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ మొదలైన సహాయ ఉపకరణాలను అందిస్తామన్నారు. జనవరి 21 నుంచి జనవరి 30వ తేదీలోపు OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు.

News January 20, 2026

HYDలో ఫేక్ ట్రాఫిక్ చలాన్ల కలకలం: జాగ్రత్త!

image

HYDలో నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసాలు పెరుగుతుండటంపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫిషింగ్ లింక్‌లను నిందితులు SMS ద్వారా పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లు ఎల్లప్పుడూ .gov.in లేదా .orgతో ముగుస్తాయని, SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయొద్దని అధికారులు సూచించారు.