News September 4, 2024

ఏలూరు: అవసరమైతే సెలవు ఇవ్వండి: DEO

image

ఏలూరు జిల్లాలోని ముంపు మండలాల్లో (పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు) నేడు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మిగతా మండలాల్లో అవసరం మేర సెలవు ఇవ్వాలని MEOలకు, పాఠశాల హెచ్ఎంలకు డీఈవో అబ్రహం బుధవారం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా పాఠశాలలు నడపడానికి, విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటే మాత్రమే పాఠశాలలకు సెలవు ఇవ్వాలన్నారు. అవసరమైతేనే ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు.

Similar News

News November 25, 2024

పోలవరంలో కనువిందు చేస్తున్న ‘అడవి నాభి పుష్పాలు’

image

ప్రకృతిలో అందంగా పూసే అడవి నాభి పుష్పాలు పోలవరం నిర్మాణ ప్రాంతమైన ట్విల్ టన్నెల్‌కు వెళ్లే దారిలో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్క వేరు దీర్ఘకాలిక వ్రణాలు, శరీరపు కుష్టు మంటలు వంటి మొదలగు వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుందని, కానీ విష ప్రభావం ఉండటం వల్ల వైద్యుల సలహామేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలంకరణకు కూడా ఉపయోగపడే ఈ మొక్క ప్రకృతికి అందాన్ని చేకూరుస్తుంది.

News November 25, 2024

పోలవరంలో కనువిందు చేస్తున్న ‘అడవి నాభి పుష్పాలు’

image

ప్రకృతిలో అందంగా పూసే అడవి నాభి పుష్పాలు పోలవరం నిర్మాణ ప్రాంతమైన ట్విల్ టన్నెల్‌కు వెళ్లే దారిలో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్క వేరు దీర్ఘకాలిక వ్రణాలు, కుష్ట, శరీరపు మంటలు వంటి మొదలగు వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుందని, కానీ విష ప్రభావం ఉండటం వల్ల వైద్యుల సలహామేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలంకరణకు కూడా ఉపయోగపడే ఈ మొక్క ప్రకృతికి అందాన్ని చేకూరుస్తుంది.

News November 24, 2024

ఏలూరు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ, పెళ్లి ఆ తర్వాత

image

మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిపై శనివారం కృష్ణా జిల్లా గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల మేరకు.. ఏలూరు జిల్లా వంగాయిగూడెంకు చెందిన ఓ బాలికకు గుణదలకు చెందిన రాంపండు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. బాలిక 4నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతడి కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.