News September 4, 2024
నిజామాబాద్: షబ్బీర్ అలీకి తప్పిన ప్రమాదం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రమాదం తప్పింది. బుధవారం ఆయన నిజామబాద్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. నగరంలోని ఆనంద్ నగర్‌లో ఇటీవల డ్రైనేజీలో పడి మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా అటవీ శాఖ రేంజ్ ఆఫీస్ ముందు కాన్వాయ్‌లోని 3 కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లు స్వలంగా దెబ్బతిన్నాయి. కాగా ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Similar News
News November 7, 2025
పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు.
News November 7, 2025
MP అర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు

గత BRS ప్రభుత్వంపై నిజామాబాద్ MPఅర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. KCR కుటుంబం చేసిన పాపానికి CM రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని పేర్కొన్నారు.
News November 7, 2025
NZB: ఐడీఓసీలో “వందేమాతరం” గేయాలాపన

“వందేమాతరం” జాతీయ గేయాన్ని రచయిత బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటిచెప్పారు.


