News September 4, 2024

ఉక్రెయిన్ ప్రభుత్వంలో పెనుమార్పులు

image

రష్యాతో యుద్ధ సంక్షోభం మరింత ముదురుతున్న వేళ ఉక్రెయిన్ ప్రభుత్వంలో పెను మార్పులు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో సగానికి పైగా వైదొలగుతారని తెలిసింది. ఇప్పటికే ఆరుగురు రాజీనామా చేశారు. ప్రెసిడెంట్ సలహాదారుపైనా వేటుపడింది. ఆయుధాల ఉత్పత్తి బాధ్యుడు ఒలెక్సాండర్ కమిషిన్‌కు రక్షణ విభాగంలోనే మరో పదవి ఇస్తారని సమాచారం. మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని జెలెన్‌స్కీ గతవారమే సంకేతాలు ఇవ్వడం గమనార్హం.

Similar News

News January 15, 2025

హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

ఒకప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్స్ పొందిన హీరో జేడీ చక్రవర్తి లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆయనతో సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేను, సత్య కలిసి సత్య సినిమా చూసేందుకు వెళ్తున్నాం’ అని ఆయన పోస్ట్ చేశారు. 1998లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో రీరిలీజ్ కానుంది.

News January 15, 2025

కేటీఆర్‌కు మరోసారి నోటీసులు?

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.

News January 15, 2025

‘డాకు మహారాజ్’ 10 లక్షల టికెట్స్ సోల్డ్

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా అదరగొడుతోంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాక్సాఫీస్ దబిడి దిబిడి’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేటితో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.