News September 4, 2024

బురదలో చెప్పులు లేకుండా పర్యటించిన లోకేశ్

image

ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాల వల్ల బుడమేరుకు భారీ గండ్లు పడిన విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ మరో మంత్రి నిమ్మలతో కలిసి పరిశీలించారు. వరదనీరు పోటెత్తగా విజయవాడతో పాటు, బుడమేరు పరీవాహక ప్రాంతాలు, గ్రామాలు, పొలాలు జలదిగ్బంధమయ్యాయి. భారీ గండ్ల వల్ల కొండపల్లి శాంతినగర్-కవులూరు మార్గంలో రాకపోకలు నిలిచాయి. కాగా లోకేశ్ వరద ముంపు ప్రాంతాల్లోని బురదలో చెప్పులు లేకుండా పర్యటించారు.

Similar News

News September 18, 2025

గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

image

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.

News September 18, 2025

గుంటూరులో డయేరియా కేసులు

image

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ తెలిపారు. 

News September 18, 2025

బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బందోబస్తు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ప్రముఖులతో మర్యాదగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో మాత్రం కఠినంగా ఉండాలని సూచించారు. ఏవైనా ఆకస్మిక ఘటనలు జరిగినప్పుడు పక్క సెక్టార్లలోని పోలీసులు సహాయం అందించాలని చెప్పారు.