News September 4, 2024

శ్రీకాకుళం: మద్యం ఉద్యోగుల బంద్ నిలుపుదల

image

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ వైన్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులంతా బంద్ చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే విజయవాడలోని వరదల కారణంగా బంద్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏపీఎస్ బిసియల్ డిపో మేనేజర్ సుబ్బారావుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Similar News

News January 9, 2026

శ్రీకాకుళం: ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాత నియామకం

image

శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. గురువారం సాయంత్రం ఈ ఆదేశాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పదవిలో తను మూడేళ్లు కొనసాగుతానని చెప్పారు. గతంలో ఈయన నరసన్నపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. పలువురు న్యాయవాదులు ఆయనను అభినందించారు.

News January 9, 2026

SKLM: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్‌ను పరీక్షల విభాగం అధికారి పద్మారావు గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 18వ తేదీ లోపు కళాశాలల్లో, యూనివర్సిటీలో చెల్లించాలని సూచించారు. పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు కాలేజీలకు సంప్రదించాలన్నారు.

News January 9, 2026

శ్రీకాకుళం: సంక్రాంతి ముందు..ప్రయాణికులకు షాక్

image

శ్రీకాకుళం ఆర్టీసీ హైయర్ బస్సు యజమానులు గురువారం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈనెల 12 నుంచి సమ్మె చేయనున్నట్లు నోటీసులో ప్రస్తావించారు. మహిళల ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి‌లో భాగంగా బస్సుకు నెలకు అదనంగా రూ.20 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీ పెరిగినా గిట్టుబాటు ధర చెల్లించడం లేదని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.