News September 4, 2024
కోల్‌కతా CBI ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా

కోల్‌కతా CBI ఆఫీస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ధర్నా చేశారు. ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసును వేగంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఏజేసీ రోడ్డును బ్లాక్ చేసి టైర్లను తగలబెట్టారు. ‘TMC, BJP మధ్య పరోక్ష అవగాహన కుదిరింది. దర్యాప్తును TMC తప్పుదారి పట్టిస్తే ఊరుకోం’ అని కాంగ్రెస్ నేత సంతోష్ పాఠక్ అన్నారు. ఈ ధర్నాకు పార్టీ మద్దతు లేదని PCC తెలిపింది.
Similar News
News September 18, 2025
వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు కూడా భారీగా లాభాలు ఆర్జించాయి.
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్‌కేర్‌లో ఉద్యోగాలు

<