News September 4, 2024

ఏలూరు: సెప్టెంబర్ 10న జాబ్ మేళా

image

ఏలూరులోని డీఎల్టీసీ, సత్రంపాడు ఐటీఐ కళాశాలలో సెప్టెంబరు 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు బుధవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 150 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా ఉంటుందన్నారు.

Similar News

News February 25, 2026

ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

image

యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

News February 25, 2026

కాళ్ల: కలెక్టర్‌ను కలిసిన వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు

image

కలెక్టర్‌ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్‌ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు. రైతుల సంక్షేమం కోసం వినూత్న ప్రయోగాలు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.

News February 25, 2026

ప.గో: ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

image

ప.గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఈ నెల 28నే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జిల్లాలోని 2,22,982 మంది లబ్ధిదారులకు రూ. 96.39 కోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు.