News September 4, 2024
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పార్టీ నుంచి గెలిచిన MLAలు మరో పార్టీలోకి మారకుండా తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. దీని ప్రకారం ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన MLAలకు పెన్షన్ రద్దు కానుంది. వారి జీవితంలో ఏ సమయంలోనైనా పార్టీ మారితే ఇది వర్తిస్తుంది.
Similar News
News December 29, 2025
భార్య సూసైడ్.. వెయ్యి కిలోమీటర్లు పారిపోయి..

బెంగళూరులో కొత్త జంట ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సూరజ్ శివన్న(35), గన్వీ(25) ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గన్వీ ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో 1000KM దూరంలోని నాగ్‌పూర్(MH)కు సూరజ్, అతడి తల్లి పారిపోయారు. ఒత్తిడి తట్టుకోలేక సూరజ్ ఉరేసుకున్నాడు. అతడి తల్లి ఆత్మహత్యకు యత్నించింది. అత్తింటి వేధింపులతోనే గన్వీ చనిపోయిందని ఫ్యామిలీ ఆరోపిస్తోంది.
News December 29, 2025
ధనుర్మాసం: పద్నాలుగో రోజు కీర్తన

‘సఖీ! అందరినీ లేపుతానన్న వాగ్దానం మరిచి నిద్రిస్తున్నావా? తెల్లవారింది, కలువలు విచ్చుకున్నాయి. మునులు, యోగులు గుడి తలుపులు తీసేందుకు తాళాలతో వెళ్తున్నారు. ఇవన్నీ ఉదయానికి సూచనలే కదా! పంకజాక్షుడైన ఆ కృష్ణుని శంఖచక్రాల సౌందర్యాన్ని, ఆయన గుణగణాలను మనమంతా కలిసి కీర్తించాలి. నీవు వెంటనే మేలుకో, గోష్టిగా సంకీర్తన చేస్తేనే మన వ్రతం ఫలిస్తుంది” అంటూ గోదాదేవి తొమ్మిదవ గోపికను మేల్కొలుపుతోంది. <<-se>>#Dhanurmasam<<>>
News December 29, 2025
ఇండియా ‘విశ్వ గురువు’ కావాలి: RSS చీఫ్

ప్రపంచ సంక్షేమం కోసం హిందువులు భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని అన్నారు. ‘ప్రపంచం మన వైపు చూస్తోంది. భారత్ విశ్వ గురువు కావడం మన ఆశయం కాదు.. ప్రపంచానికి అవసరం. ఇందుకు చాలా కష్టపడి పని చేయాలి’ అని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


