News September 4, 2024
మండపేట: వరద బాధితులకు BSR రూ.కోటి సాయం
మండపేట మండలం ఏడిదకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బలుసు శ్రీనివాస్ రావు BSR వరద బాధితులను ఆదుకునేందుకు తమ సంస్థ తరపున రూ.కోటి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వరద బాధితులకు బి.ఎస్.ఆర్ ఇన్ ఫ్రా టెక్ తరపున అధినేత BSR కోటి రూపాయల విరాళాన్ని బుధవారం ఏపీ సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 24, 2024
గోకవరం: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన విషాదకర ఘటన గోకవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మి గోకవరం ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లో పని చేస్తున్నారు. ప్రసవం నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఉమ్మనీరు రక్తనాళాల్లోకి వెళ్లి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను చూడకుండానే మృతి చెందడం కలిచివేసింది.
News November 24, 2024
కాకినాడ: టీచర్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు
కాకినాడలోని ఓ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించేందుకు పాఠశాలకు వచ్చిన మహిళా పోలీసులకు తమ ఒంటిపై చేతులు వేసి టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఉపాధ్యాయుడిని పీఎస్‌కు తరలించారు.
News November 23, 2024
రాజవొమ్మంగి: 35 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఒకే పాఠశాల విద్యార్థులు
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో 35 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ కృష్ణారావు శనివారం మీడియాకు తెలిపారు. అరకులో జరిగిన జూడో, వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాలీబాల్ క్రీడల్లో విజేతలుగా నిలిచారని చెప్పారు. విజేతలతోపాటు వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని సైతం ప్రిన్సిపల్, టీచర్స్ అభినందించారు.