News September 4, 2024
విద్య, వైద్యం పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: మంత్రి దామోదర్

పేదవాడికి ప్రాథమిక హక్కుగా అందాల్సిన విద్యా, వైద్యంపై జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిపారు. త్వరలో మెదక్లో సిటీ స్కాన్‌తో పాటు మరో డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 17, 2025
మెదక్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్ అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం PLAN INTERNATIONAL ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.
News September 17, 2025
జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.