News September 4, 2024
రాయచోటి: కిడ్నాప్ కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్

రాయచోటి పట్టణం కొత్తపేట- రామాపురానికి చెందిన కరాటే రామచంద్ర రైస్ పుల్లింగ్ మిషన్ నిర్వహిస్తున్నాడు. అయితే అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామచంద్ర కుటుంబ సభ్యులను బెంగళూరుకు చెందిన నవీన్ మనుషులు కిడ్నాప్ చేసిన కేసులో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. వారిలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఆగస్టు 31న సంబేపల్లిలో కిడ్నాప్ జరిగినట్లు సమాచారం.
Similar News
News November 3, 2025
ఒంటిమిట్ట రామాలయంలో TTD క్యాలెండర్లు

TTD 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విక్రయిస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు TTD నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయిస్తామన్నారు.
News November 3, 2025
ప్రపంచ కప్‌లో కడప అమ్మాయికి 14 వికెట్లు

భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కడప జిల్లాకు చెందిన శ్రీచరణి(21) కీలక పాత్ర పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆమె జట్టులోకి అడుగు పెట్టారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా ఇప్పటి వరకు ఆమె 22 వికెట్ల పడగొట్టారు. వరల్డ్ కప్‌లోని 9 మ్యాచుల్లోనే 14 వికెట్లు తీయడం విశేషం. ఓ బాల్ స్పిన్, మరో బాల్ నేరుగా వేసి బ్యాటర్లను తికమకపెట్టారు. సెమీస్‌లో ఆస్ట్రేలియా స్కోర్ మరింత పెరగకుండా చివరి ఓవర్లు కట్టుదిట్టంగా వేశారు.
News November 3, 2025
పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.


