News September 4, 2024
రూ.కోటి విరాళం ప్రకటించిన అనకాపల్లి ఎంపీ
వరద ముంపు బాధితులకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బాసటగా నిలిచారు. విజయవాడ బాధితులకు సీఎం రమేశ్ కుటుంబం కోటి రూపాయల విరాళం ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోలుకోలేని విధంగా నష్టం జరిగిందన్నారు. సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 21, 2025
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 21, 2025
స్టీల్ ప్లాంట్: విద్యుత్ షాక్‌తో కార్మికుడి దుర్మరణం
స్టీల్ ప్లాంట్ రైల్వే లైన్‌లో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్టు కార్మికుడు సోమవారం మృతి చెందాడు. ఇస్లాం పేటకు చెందిన మహమ్మద్ గౌస్ (26) స్టీల్ ప్లాంట్‌లో రైల్వేకు చెందిన సురభి ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్నాడు. ట్యాంకర్‌పై ఉన్న విద్యుత్ లైన్లు తాకడం వల్ల షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 21, 2025
విశాఖ: అలా చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష..!
విశాఖలో DMHO కార్యాలయంలో ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లకు మహిళల హక్కుల పరిరక్షణ, లింగ వివక్షపై అవగాహన నిర్వహించారు. డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట శేషమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. హాస్పిటల్లో లింగ నిర్ధారణ చేయకూడదని, అలా చేస్తే మొదటిసారి రూ.10వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష, రెండో సారి లక్ష రూపాయల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష, నేరం నిరూపణ ఐతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు.