News September 4, 2024
రైతులకు ఫ్రీగా పంప్ సెట్‌లు: సీఎం రేవంత్

TG: రైతులను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలి. వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. రైతులకు సోలార్ పంప్ సెట్‌లు ఫ్రీగా ఇవ్వాలి. మిగులు విద్యుత్‌పై ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేయాలి. కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలి’ అని విద్యుత్ శాఖపై సమీక్షలో CM ఆదేశించారు.
Similar News
News January 14, 2026
సింగర్ మరణం.. మద్యం మత్తులోనే జరిగిందన్న సింగపూర్ పోలీసులు

అస్సాం సింగర్ జుబీన్ గార్గ్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని సింగపూర్ పోలీసులు తేల్చినట్లు ఆ దేశ కోర్టు వెల్లడించింది. ‘జుబీన్ మద్యం మత్తులో ఉన్నాడు. వేసుకున్న లైఫ్ జాకెట్ విప్పేశాడు. మళ్లీ ఇస్తే వేసుకోలేదు’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో సింగపూర్ వెళ్లిన జుబీన్ స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోగా, ఆయన్ను హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి.
News January 14, 2026
ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.
News January 14, 2026
ఈ నెల 19 నుంచి సర్పంచులకు ట్రైనింగ్

TG: రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రకటించింది. జిల్లాలు, బ్యాచుల వారీగా 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచులో 50 మంది ఉండనున్నారు.


