News September 4, 2024

పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఇది చదవండి

image

నెలల పిల్లలు ఫోన్, టీవీ స్క్రీన్లను చూడటం వల్ల వారిలో పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఇండియన్ పీడియాట్రిక్స్ అకాడమీ హెచ్చరించింది. వర్చువల్ ఆటిజం, మాట రావడం ఆలస్యమవడం, ఎదుగుదల సమస్యలవంటివి ఉత్పన్నమవ్వొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2-5 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు స్క్రీన్ టైమ్ గంట దాటొద్దని, చిన్నారులకు చదువు, ఆటలు, నిద్ర అన్నీ బ్యాలెన్స్ అయ్యేలా తల్లిదండ్రులు చూసుకోవాలని సూచించింది.

Similar News

News January 13, 2026

‘స్కిల్’ కేసు.. అప్పుడు ఏం జరిగిందంటే?

image

AP: 2014-19లో <<18842559>>స్కిల్<<>> డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పేరిట అప్పటి TDP ప్రభుత్వం రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడిందని గత YCP గవర్నమెంట్ ఆరోపించింది. ఈక్రమంలోనే 2023 సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. CBNకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 53 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

News January 13, 2026

తిరుమల: శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 68,542 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా.. 22,372 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.98 కోట్లు ఆదాయం వచ్చిందని TTD వెల్లడించింది.

News January 13, 2026

తెలంగాణలో ‘కొత్త’ పంచాయితీ!

image

రాష్ట్రంలో జిల్లాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో నాటి CM KCR జిల్లాలను విభజించారు. కానీ అది శాస్త్రీయంగా జరగలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ప్రస్తుత CM రేవంత్ ఆరోపించారు. వాటిని సరిచేసేందుకు కమిటీ వేస్తామన్నారు. అయితే ప్రజలకు పాలన దగ్గర చేయాలనే కొత్త జిల్లాలు తెచ్చామని, వాటిని ముట్టుకుంటే అగ్గి రాజేస్తామన్న KTR మాటలతో రాజకీయ దుమారం మొదలైంది.