News September 5, 2024
FY2024లో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్లు వీరే
2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్ల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. రూ.66 కోట్లతో విరాట్ కోహ్లీ ఆ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆయన తర్వాతి స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ(రూ.38 కోట్లు), సచిన్ టెండూల్కర్(రూ.28 కోట్లు), సౌరవ్ గంగూలీ(రూ.23 కోట్లు), హార్దిక్ పాండ్య(రూ.13 కోట్లు), రిషభ్ పంత్ (రూ.10 కోట్లు) ఉన్నారు.
Similar News
News February 3, 2025
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సిద్ధం: సోనూసూద్
సామాన్యుల కోసం తన ఫౌండేషన్ పని చేస్తుందని, AP బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు తాను సిద్ధమని సోనూసూద్ చెప్పారు. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం అంబులెన్సులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అటు, సోనూసూద్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తన ఫౌండేషన్ ద్వారా 4 అంబులెన్సులు ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేకూర్చినట్లు అయిందన్నారు.
News February 3, 2025
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
AP: మంత్రి నారా లోకేశ్ రేపు సా.4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సా.5.45 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేశ్ విజయవాడ బయల్దేరనున్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
News February 3, 2025
మత మార్పిడులపై సంచలన బిల్లు
మతమార్పిడులపై సంచలన బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు దాదాపు 2 నెలల ముందు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే అనుమతి లభిస్తుంది. ఎస్సీలు, తెగలు, మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే 2-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా ఉంటుంది.