News September 5, 2024

ఈనెల 11న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈనెల 11న పార్టీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు KCR సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో రైతుల సమస్యలు, కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కష్టాలు, రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ నిరసనలు, రోడ్ షోలు చేపట్టనున్నట్లు సమాచారం.

Similar News

News January 15, 2025

యుద్ధ నౌకలు జాతికి అంకితం

image

భారత నేవీ అమ్ములపొదిలో మూడు అత్యాధునిక యుద్ధ నౌకలు చేరాయి. INS సూరత్, INS నీలగిరి యుద్ధ నౌకలు, వాఘ్‌షీర్ జలాంతర్గామి(సబ్ మెరైన్)ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ముంబై డాక్ యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందని మోదీ అన్నారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.

News January 15, 2025

ఆ యాప్ బ్యాన్.. పిచ్చెక్కిపోతున్న యువత

image

అమెరికాలో ఈ నెల 19 నుంచి టిక్‌టాక్ బ్యాన్ కానుందనే వార్తల నేపథ్యంలో ఆ దేశ యువత ప్రత్యామ్నాయ యాప్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో చైనాకు చెందిన Xiaohongshu యాప్ అమెరికా డౌన్‌లోడ్ లిస్టులో టాప్‌లో ఉంది. 2 రోజుల్లోనే 7 లక్షల డౌన్‌లోడ్స్ వచ్చాయి. ఈ యాప్‌కు చైనాలో 300 మిలియన్ల యూజర్లు ఉన్నారు. కాగా అమెరికా జనాభాలో సగం మంది అంటే 170 మిలియన్ల మంది (17 కోట్లు) టిక్‌టాక్ వాడుతుండటం గమనార్హం.

News January 15, 2025

‘కల్కి-2’ రిలీజ్ అయ్యేది అప్పుడే: అశ్వనీదత్

image

‘కల్కి-2’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్, కమల్ ముగ్గురే ఎక్కువగా కనిపిస్తారని చెప్పారు. దీపిక పాత్రకూ ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. అవసరమైతేనే కొత్త పాత్రలను పరిచయం చేస్తామన్నారు. నాగ్ అశ్విన్ ఆలోచించే తీరు, దర్శకత్వ విధానం గొప్పగా ఉంటాయని ప్రశంసించారు.