News September 5, 2024

దులీప్ ట్రోఫీలో విశాఖ క్రికెటర్లు

image

దులీప్ ట్రోఫీ తొలిదశ మ్యాచ్‌లు గురువారం నుంచి బెంగళూరు, అనంతపురంలో ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నమెంటులో విశాఖకు చెందిన భరత్, నితీశ్ కుమార్ రెడ్డి, రికీబుయ్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. నితీశ్ IPLలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించారు. భరత్‌కు భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. రికీబుయ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్‌లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు.

Similar News

News November 12, 2025

విశాఖలో మరో ఐటీ క్యాంపస్‌‌ ఏర్పాటు

image

విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. కాపులుప్పాడలో రూ.115 కోట్లతో.. 2,000 మందికి ఉద్యోగాలిచ్చే విధంగా క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, AIML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీతో క్యాంపస్ నిర్మించనున్నారు. ఎకరం రూ.కోటి చొప్పున, 4 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది.

News November 12, 2025

విశాఖలో నేటి నుంచి డ్రోన్ ఎగురవేయుట నిషేదం

image

విశాఖలో భాగస్వామ్య సదస్సులు జరగనున్న నేపథ్యంలో నగరవాసులకు సీపీ శంఖబ్రత బాగ్చి మంగళవారం పలు సూచనలు చేశారు. ఈనెల 12వ తేదీ నుుంచి 16వ తేదీ వరకు ఏయూ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ ఎగురవేయట నిషేధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News November 11, 2025

విశాఖ: అబార్షన్ కిట్ అమ్ముతున్న మెడికల్ షాప్‌పై కేసు

image

డాక్టర్ మందులు చీటీ లేకుండా గర్భాన్ని తొలగించేందుకు వాడే మందులను అమ్ముతున్న మెడికల్ షాప్‌పై విశాఖ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. సీపీ సూచనలతో గోపాలపట్నంలోని దర్విన్ ఫార్మసీపై మంగళవారం దాడులు చేయగా ఆరు కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. దుకాణంపై కేసు నమోదు చేసి మందులను డ్రగ్ కంట్రోలర్ అప్పగిస్తామని వెల్లడించారు.