News September 5, 2024

కడప: మీ జీవితాన్ని మార్చిన గురువు ఎవరు..?

image

విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు (Teacher) కృషి వెలకట్టలేనిది. అటువంటి వారిలో కడప జిల్లాకు చెందిన 79 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు వరించాయి. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా నేడు టీచర్స్ డే జరుపుకుంటున్నాము. మరి మీ జీవితాన్ని మార్చిన టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి.

Happy Teachers’ Day

Similar News

News September 17, 2025

తిరుమలలో పులివెందుల వాసి మృతి

image

తిరుమలలో బుధవారం శ్రీవారి భక్తుడు మృతి చెందాడు. టీటీడీ అధికారుల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల తాలూకా పార్నపల్లికి చెందిన శ్రీవారి భక్తుడు తిరుమల అద్దె గదుల ప్రాంతంలోని ఓ బాత్రూంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

కడప జిల్లా వృద్ధేలక్ష్యం: కలెక్టర్ శ్రీధర్

image

ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే జిల్లాలో మంచి వృద్ధి సాధించామని, రాష్ట్ర స్థూలోత్పత్తిలో 17.33% వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామని జిల్లా కడప కలెక్టర్ శ్రీధర్ CM సమావేశంలో వివరించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నాలుగవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు.

News September 17, 2025

బద్వేల్: దొంగనోట్ల మార్పిడి.. ఐదుగురికి జైలు శిక్ష

image

దొంగ నోట్ల మార్పిడి కేసులో ఐదుగురు ముద్దాయిలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేలు జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. SI మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. సిద్దవటం మండలంలోని మాధవరం-1లోని ఓ వైన్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన మాధవరెడ్డి, షర్ఫుద్దీన్, వెంకటేశ్వర్లు, అల్తాఫ్, హుస్సేన్ వలిలు వెయ్యి రూపాయల దొంగ నోటు చలామణి చేయగా కేసు నమోదైంది.