News September 5, 2024
అక్కడ పనిచేసే వైద్యుల జీతం భారీగా పెంపు!

TG: మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి చాలామంది వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా అక్కడివారికి మెరుగైన వైద్యసేవలు అందడంలేదు. దీంతో గిరిజన, గ్రామీణ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల జీతాలను భారీగా పెంచి, సేవలను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే రెట్టింపు వేతనం(100% ఇన్సెంటివ్), గిరిజన ప్రాంతాల్లో అయితే 125% ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ మంత్రి ఆమోదం తెలిపారు.
Similar News
News November 3, 2025
SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.
News November 2, 2025
బిగ్‌బాస్: దువ్వాడ మాధురి ఎలిమినేట్

బిగ్‌బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియలో మాధురి, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్‌లు ఉన్నారు. ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
News November 2, 2025
హైడ్రాలో BRS అనుకూల అధికారులు: జగ్గారెడ్డి

TG: హైడ్రాపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి BRSకు లాభం కలిగేలా చూస్తున్నారనే అనుమానం ఉందన్నారు. ‘హైడ్రా అంశాన్ని తెరపైకి తెచ్చి జూబ్లీహిల్స్‌లో నవీన్‌ను ఓడించే కుట్ర జరుగుతోంది. ఎన్నికలప్పుడే KTRకు హైడ్రా ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పాలి. BRS అనుకూల హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే CM రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.


