News September 5, 2024
ఖరీఫ్‌లో 100 శాతం వరి సాగు పూర్తి: వ్యవసాయ శాఖ
TG: ఖరీఫ్ సీజన్‌లో అన్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 1.20 కోట్ల ఎకరాల్లో పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వరి సాగు లక్ష్యం 57.18 లక్షల ఎకరాలు కాగా 100% నాట్లు పడినట్లు తెలిపింది. పత్తి 50.48L ఎకరాలు, పప్పు ధాన్యాలు 5.66L ఎకరాలు, మొక్కజొన్న 5.11L ఎకరాలు, సోయాబీన్ 3.97L ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంది.
Similar News
News January 23, 2025
సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు ₹లక్ష ఇస్తా: సింగర్
సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను బాలీవుడ్ సింగర్ మికా సింగ్ ప్రశంసించారు. ఫేవరెట్ సూపర్ స్టార్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు కనీసం రూ.11 లక్షల రివార్డ్ అయినా ఇవ్వాలి. ఆయన వివరాలు చెప్పండి. నా తరఫున రూ.లక్ష ఇవ్వాలనుకుంటున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇవాళ ఆటో డ్రైవర్‌ను సైఫ్ కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.
News January 23, 2025
దావోస్‌లో అందరం ఒక్కటే: సీఎం చంద్రబాబు
చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని AP సీఎం చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి పలు పార్టీలు వచ్చినా దావోస్‌లో అందరం ఒక్కటే. గతంలో ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారు. భారత్ ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏపీ సుస్థిరాభివృద్ధికి చాలా కష్టపడాలి’ అని దావోస్ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు అన్నారు. ఇందులో భారత్ నుంచి వెళ్లిన వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు.
News January 23, 2025
ఈరోజు నమాజ్ వేళలు
తేది: జనవరి 23, గురువారం ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు అసర్: సాయంత్రం 4.31 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ఇష: రాత్రి 7.22 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.