News September 5, 2024
Stock Market: ఫ్లాట్‌గా మొదలైన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. BSE సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 82,387 వద్ద చలిస్తోంది. NSE నిఫ్టీ 10 పాయింట్లు ఎగిసి 25,209 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 24:26గా ఉంది. అల్ట్రాటెక్, టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, JSW స్టీల్ టాప్ గెయినర్స్. HDFC లైఫ్, HCL టెక్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, బ్రిటానియా టాప్ లూజర్స్.
Similar News
News February 3, 2025
ప్రైవేట్ స్కూళ్లపై మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం
AP: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. వాటి గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాల సమావేశంలో వివరించారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని వారితో అన్నట్లు ట్వీట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.
News February 3, 2025
సంజూకు గాయం.. 6 వారాలు ఆటకు దూరం!
ఇంగ్లండ్‌తో 5వ టీ20లో ఆర్చర్ వేసిన బంతి సంజూ శాంసన్ చూపుడు వేలికి తగిలి గాయమైన విషయం తెలిసిందే. నొప్పితో అతను వికెట్ కీపింగ్‌కు కూడా రాలేదు. కాగా, శాంసన్ వేలికి ఫ్రాక్చర్ అయిందని 4-6 వారాల పాటు బ్యాట్ పట్టలేరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకొని నేరుగా మార్చిలో ప్రారంభమయ్యే IPL ఆడొచ్చని పేర్కొన్నాయి. సంజూ ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు.
News February 3, 2025
ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా?: MLC కవిత
BCల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని, గతంతో పోల్చితే వారి జనాభా ఎలా తగ్గుతుందని MLC కవిత విమర్శించారు. ‘TGలో ఏ లెక్కన చూసినా 50-52% BCలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరం. సకల జనుల సర్వేకు, ఇప్పటి సర్వేకు 21 లక్షల BC జనాభా తేడా కనిపిస్తోంది. OCల జనాభా ఎక్కువ కనిపిస్తోంది. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీల, SC, ST జనాభా తగ్గుతుందా?’ అని ప్రశ్నించారు.